తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంత నియోజకవర్గం అయిన ప్రత్తిపాడులో కోడిపందాలు, గుండాటలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. వివిధ రకాల జూదాల్లో అన్ని వయసులు వాళ్లు పాల్గొంటున్నారు. ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో 10 సంవత్సరాల వయసు పిల్లలు సైతం గుండాటలు ఆడుతున్నారు.
చదువుకునే వయసులో జూదం వైపు మళ్లుతున్న వారిని ఎవరూ అడ్డుకోవకపోవటం విచిత్రంగా ఉంది. వీటిపై పోలీసులు కూడా ఎటువంటి కట్టడి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను చూసి ఆవేదన చెందుతున్నారు.