చిట్టి చేతులు చేశాయి అద్భుతం.. - chilren distribute masks for carona
తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో చిన్నారులు కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. మాస్కులు పంచారు. ఆడుకునే వయసులో ఆటకు విరామం ఇచ్చి మాస్కులు పంచారు. శానిటేషన్ వస్త్రం, పిన్నులు కొని... మాస్కులు తయారు చేశారు. ఆ మాస్కులు గ్రామస్థులకు పంచి.. పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. చేతులు డెటాల్తో కడుక్కోవాలని జాగ్రత్తలు చెప్పారు. వారి ప్రయత్నాని గ్రామస్థులు అభినందించారు.
కరోనాపై తూర్పుగోదావరిలో చిన్నారుల అవగాహన