ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘరానా మోసగాడు.. అబద్ధాలతో కోట్లు కొల్లగొట్టాడు - 2 కోట్లు కొల్లగొట్టిన దొంగ

నమ్మించాడు. ఫౌండేషన్ పేరుతో మాయమాటలు చెప్పాడు. అది చేస్తా అనీ.. ఇది చేస్తా అనీ.. కట్టు కథలు అల్లాడు. ఎమ్మెల్యేను పిలిపించి మరీ.. నాటకాలు ఆడాడు. ఆఖరికి.. తనకు కావాల్సింది దక్కాక.. మొహం చాటేశాడు. ఎవరా కేటుగాడు?

ganesh

By

Published : Sep 4, 2019, 12:01 AM IST

తూర్పు గోదావరి జిల్లాలో భారీ మోసం బయటపడింది. అమాయకులను నమ్మించి.. నట్టేట ముంచిన గణేశ్ అనే మోసగాడి ఉదంతం.. సంచలనంగా మారింది. ఇతగాడి చోరలీలలు వింటే మహామహులైన దొంగలూ నోరెళ్లబెట్టాల్సిందే. ఆ వివరాలు మచ్చుకు కొన్ని మీరూ తెలుసుకోండి.

  1. మాధవీలత ఫౌండేషన్ ద్వారా ఆటోలు ఇప్పిస్తానంటూ 200 మంది నుంచి ఒక్కొక్కరి దగ్గరా లక్షా 25 వేలు వసూలు చేశాడు. అంటే.. 2 కోట్ల 50 లక్షల రూపాయలు దోచేశాడు.
  2. రాయితీపై బోర్ వెల్స్ వేయిస్తానంటూ మరో 200 మందికి పైగా 20 వేల చొప్పున.. 4 లక్షల రూపాయలకు పైగానే దండుకున్నాడు.
  3. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సామగ్రి ఇప్పిస్తానంటూ.. చాలా మంది నుంచి 70 వేల రూపాయల చొప్పున.. మొత్తంగా లక్షల్లోనే వసూలు చేశాడు.

ఇలా బయటపడింది

గణేశ్ ఏర్పాటు చేసిన మాధవీలత ఫౌండేషన్

ఆటోలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్న గణేశ్.. అందులో కొందరికి ఫైనాన్స్ సంస్థల నుంచి వాహనాలు ఇప్పించాడు. చివరికి ఈఎమ్ఐ కట్టడం లేదంటూ ఫైనాన్స్ సంస్థ నుంచి నోటీసులు అందుకున్న ఆటో కార్మికులు.. గణేశ్ మోసం చేశాడని ఆలస్యంగా గుర్తించారు. ఈ విషయంతో పాటు.. ఇతర వ్యవహారాల్లో మోసపోయిన ఏలేశ్వరం, జగ్గంపేట, కిర్లంపూడి వాసులు.. తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. నిందితుడు గణేశ్​ను జగ్గంపేట మండలం మామిడాడకు చెందిన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు.. ప్రత్తిపాడు, జగ్గంపేట మండలాల్లో డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్టు తెలుసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details