ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చవిటిదిబ్బల పీహెచ్​సీ ఎదుట ఆశా కార్యకర్తల ఆందోళన - చవిటి దిబ్బల ఆశా కార్యకర్తల ధర్నా తాజా వార్తలు

వై.రామవరం మండలం చవిటి దిబ్బల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ఆశా కార్యకర్తలు నిరసనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంతరం పీహెచ్​సీ వైద్యురాలు తేజశ్రీకి వినతిపత్రం అందించారు.

chaviti dibbala asha workers protest at phc centre
ఆందోళనకు దిగిన చవిటి దిబ్బల ఆశా కార్యకర్తలు

By

Published : Aug 7, 2020, 9:19 PM IST

తూర్పుగోదావరి జిల్లా చవిటి దిబ్బల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆశా కార్యకర్తలు ఆందోళన చేశారు. క్షేత్రస్థాయిలో ఎంతో కష్టపడి పనిచేస్తున్న ఆశా వర్కర్లకు సకాలంలో వేతనాలు చెల్లించాలని ఆశా వర్కర్ల సంఘం నాయకురాలు వీర లక్ష్మి డిమాండ్​ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆశా కార్యకర్తలకు వర్తింపజేయాలని కోరారు. అనంతరం వైద్యురాలు తేజశ్రీకి వినతిపత్రం సమర్పించారు.

ABOUT THE AUTHOR

...view details