ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఫిర్యాదు చేసినవాళ్లు గంటల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు' - Chandrababu comments on police

గొల్లలగుంటలో శ్రీనివాస్‌రెడ్డి అపహరణ, హత్యపై తెదేపా అధినేత చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఫిర్యాదు చేసినవాళ్లు గంటల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. శ్రీనివాస్‌రెడ్డిని చంపిన వారిని తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Chandrababu Angry over Gollalagunta Murder incident
Chandrababu Angry over Gollalagunta Murder incident

By

Published : Feb 1, 2021, 11:01 PM IST

తూర్పుగోదావరి జిల్లా గొల్లలగుంటలో శ్రీనివాస్‌రెడ్డి అపహరణ, హత్య దారుణమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాస్‌రెడ్డి హత్య.. క్షీణించిన శాంతిభద్రతలకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఫిర్యాదు చేసినవాళ్లు గంటల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు.. అని అనుమానం వ్యక్తం చేశారు. శ్రీనివాస్‌రెడ్డిని చంపిన వారిని తక్షణం అరెస్టు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులను కఠినంగా శిక్షించాలన్నారు.

లోకేశ్​ పర్యటన...

మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ గొల్లలకుంట వెళ్లనున్నారు. శ్రీనివాస్‌రెడ్డికి నివాళి అర్పించి, ఆయన కుటుంబసభ్యులను లోకేశ్‌ పరామర్శించనున్నారు.

ఇదీ చదవండీ... శవమై తేలిన సర్పంచ్ అభ్యర్థి భర్త ..నిన్న అపహరణకు గురైన మృతుడు

ABOUT THE AUTHOR

...view details