తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో ఆటోల ద్వారా గ్రామాల్లో అధికారులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అమలాపురం డీఎస్పీ షేక్ మాసూం బాషా, ఆర్డీవో బిహెచ్. భవాని శంకర్ పలు గ్రామాల్లో పర్యటించి సిబ్బందికి ఆదేశాలు ఇస్తున్నారు. మరోవైపు ఆరోగ్య సిబ్బంది, వాలంటీర్లు, పంచాయతీ సిబ్బంది గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య స్థితిగతులపై సర్వే చేస్తున్నారు.
కరోనా కట్టడిపై కోనసీమలో ఆటోలతో ప్రచారం - కోనసీమలో లాక్డౌన్
కరోనాపై అవగాహన పెంచేందుకు తూర్పు గోదావరి జిల్లాలో అధికారులు ఆటోల ద్వారాా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య స్థితిగతులపై సర్వే చేస్తున్నారు.
కోనసీమలో లాక్డౌన్