తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం పుల్లంగి గ్రామానికి చెందిన పూసర్ల ప్రమోహన అనే గిరిజన యువతికి బోదులూరు గ్రామానికి చెందిన గొర్లె ఉదయంతో వివాహం కుదిరింది.
వధువు పుల్లంగి గ్రామం నుంచి బోదులూరుకు కారులో బయలుదేరింది. దారిలో కొండవాగు ఉద్ధృతంగా ప్రవహించగా.. స్థానికులు భుజాలపై ఎత్తుకుని ఆమెను వాగు దాటించారు. అనంతరం బోదలూరులో వారి వివాహం జరిగింది.