భారీ వర్షం ధాటికి తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం నీట మునిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన యాగశాలలోకి నీరు చేరింది.
హఠాత్తుగా కురిసిన వాన వల్ల.. దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాలకు అవాంతరం ఏర్పడింది. వేడుకలకు అంతరాయం కలుగకుండా.. అధికారులు ఇంజిన్ల సహాయంతో నీటిని బయటకు పంపిస్తున్నారు.