తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో బ్రహ్మకమలం పుష్పం వికసించింది. స్వగృహ అపార్ట్‌మెంట్స్‌లో నివసించే నరసింహారావు.. రెండేళ్ల క్రితం బ్రహ్మకమలం మొక్కను నాటాడు. పది రోజుల క్రితం మొక్కకు నాలుగు మొగ్గలు రాగా.. వాటిలో రెండు పుష్పాలుగా వికసించాయి. బ్రహ్మకమలం పుష్పం శివునికి ఎంతో ప్రీతికరమైనదని భక్తులు నమ్ముతారని,.. అలాంటి పుష్పం తమ ఇంట్లో పూయడం ఎంతో సంతోషంగా ఉందని నరసింహారావు, కుటుంబసభ్యులు తెలిపారు. ముందుగా భక్తితో మొక్కకి పూజ చేసి, ఆ తర్వాక పుష్పాన్ని స్థానిక శివాలయంలో స్వామివారికి సమర్పించి పూజలు నిర్వహించారు.
రావులపాలెంలో విరబూసిన బ్రహ్మకమలం - శివుడికి ప్రీతికరమైన పుష్పం
తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెంలో బ్రహ్మకమలం విరబూసింది. స్వగృహ అపార్ట్‌మెంట్స్‌లో నివసించే నరసింహారావు రెండేళ్ల క్రితం ఈ మొక్కను నాటాడు. ఇంతకాలానికి పుష్పం విరబూయటంతో ఆ కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తోంది.
బ్రహ్మకమలం శివుడికి ప్రీతికరమైనది