ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విషాదం: మేకల మేత కోసం చెట్టెక్కిన బాలుడు..పట్టుతప్పి..

పదకొండేళ్ల పసిప్రాయం.. ఆడుకునే వయసు.. తండ్రికి చేతనైనంత సాయం చేద్దామని.. మేకలకు ఆహారం కోసం ఆకులు కోసేందుకు చెట్టెక్కాడా బాలుడు. విధి వక్రించి.. విద్యుదాఘాతానికి గురై చనిపోయాడు. ఈ దయనీయ ఘటన తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలో జరిగింది.

మేకలకు మేత కోసం చెట్టెక్కిన బాలుడు విద్యుదాఘాతంతో మృతి
మేకలకు మేత కోసం చెట్టెక్కిన బాలుడు విద్యుదాఘాతంతో మృతి

By

Published : Aug 25, 2021, 7:50 AM IST

తూర్పుగోదావరి జిల్లా కోటపాడు గ్రామానికి చెందిన పత్తి నాగేంద్ర(11) చెట్టెక్కి ఆకులు కోస్తుండగా పట్టుతప్పి పక్కనే ఉన్న విద్యుత్తు తీగపై పడిపోయాడు. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గురై శరీరం కాలి చనిపోయాడు. తీగపై వేలాడుతున్న మృతదేహాన్ని చూసి తండ్రి ముసలయ్యతోపాటు స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విద్యుత్తు సరఫరా నిలిపేసి అతికష్టం మీద మృతదేహాన్ని కిందకు దించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పెద్దాపురం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై టి.రామకృష్ణ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details