బోటు ప్రమాదంలో గల్లంతైన వారికోసం మూడో రోజు గాలింపు
పాపికొండల సమీపంలో గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో మూడో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పలు చోట్ల నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. సుడిగుండాలు, వరద ఉద్ధృతితో సహాయక బోట్లు నిలవని పరిస్థితి నెలకొంది.
తూర్పు గోదావరి జిల్లా పాపికొండల సమీపంలో గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో మూడో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ17వ నెంబరు గేటు వద్ద ఒకటి...పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ఇసుక రేవు వద్ద మరొకటి...కచ్చులూరు వద్ద ఇంకొకటి...ఎగువ కాఫర్ డ్యామ్ వద్దకు వచ్చిన మరో మృతదేహం కలుపుకొని మొత్తం4మృతదేహాలు లభ్యమయ్యాయి. 315అడుగుల లోతులో బోటు మునిగినట్లు అధికారులు గుర్తించారు.బోటు మునిగిన ప్రదేశంలో సుడిగుండాలు ఉండడంతో...గాలింపు చర్యలకు ప్రతికూలంగా మారాయి.