తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచిలో సుమారు ఏడడుగుల పొడవు ఉన్న రక్తపింజరి పామును రైతులు చంపారు. పట్టిసం వెంకట ప్రసాద్ అనే రైతు పొలంలో పని చేస్తుండగా పాము అతనిపై దాడికి యత్నించింది. అక్కడే ఉన్న మిగతావారు గమనించి దాన్ని కర్రలతో కొట్టి చంపారు. ఇటీవల వచ్చిన వరదలతో మెట్టలో సర్పాలు అధికంగా సంచరిస్తున్నాయి.
దాడికి యత్నించిన రక్త పింజరి.. కొట్టి చంపిన రైతులు - ఏడడుగుల పొడవు ఉన్న రక్తపింజరి
పొడ జాతికి చెందిన రక్తపింజరి ఓ రైతుపై దాడికి యత్నించింది. అది చూసి మిగతా వాళ్లు కర్రలతో దాన్ని కొట్టి చంపేశారు. దాని పొడవు సుమారు 7 అడుగులు ఉంది.
దాడికి యత్నించిన రక్త పింజరి.. కొట్టి చంపిన రైతులు