నేడు చలో అంతర్వేదికి పిలుపునిచ్చిన భాజపా, జనసేన
08:15 September 09
నేడు చలో అంతర్వేదికి పిలుపునిచ్చిన భాజపా, జనసేన
లక్ష్మీనరసింహ స్వామి రథం దగ్ధం నేపథ్యంలో.. భాజపా, జనసేన నేతలు నేడు చలో అంతర్వేదికి పిలుపునిచ్చారు. ఇదే సమయంలో కోనసీమ వ్యాప్తంగా భాజపా, జనసేన నేతలను గృహనిర్బంధం చేస్తున్నారు.కొత్తపేటలో రాష్ట్ర భాజపా కార్యవర్గ సభ్యుడు పాలూరు సత్యానందం, రావులపాలెంలో భాజపా గుంటూరు జిల్లా పదాధిపతి రామకృష్ణారెడ్డిలను హౌస్ అరెస్టు చేశారు. 30 పోలీసు యాక్టు అమలు కారణంగా అంతర్వేది వచ్చేందుకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. నిన్న చలో అంతర్వేది కార్యక్రమంలో పాల్గొన్న 43 మంది నేతలపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఇదీ చదవండి:పోలీస్ వలయంలో అంతర్వేది.. నిరసనలకు అనుమతి లేదు: డీఐజీ మోహన్రావు