65వ జాతీయ స్థాయి బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అండర్-19 బాలురు విభాగంలో జరుగుతున్న ఈ పోటీల ద్వారా ... అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనేందుకు అర్హత కలిగిన క్రీడాకారులను ఎంపిక చేయనున్నారు. పుదుచ్చేరి క్రీడల శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి... క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. మొదటి మ్యాచ్ గా పుదుచ్చేరి వర్సెస్ ఒడిశా జట్లు తలపడ్డాయి. ఈ పోటీల్లో ఒడిశాపై పుదుచ్చేరి విజయం సాధించింది. అనంతరం జరిగిన వేరే మ్యాచ్ లో పంజాబ్ పై గుజరాత్ జట్టు గెలిచింది.
యానాంలో హోరాహోరీగా బాస్కెట్బాల్ పోటీలు - యానాంలో ప్రారంభమైన జాతీయస్థాయి బాస్కెట్బాల్ పోటీలు
కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో 65వ జాతీయస్థాయి బాస్కెట్బాల్ పోటీలు మెుదలయ్యాయి. మెుదటి మ్యాచ్లో ఒడిశాపై పుదుచ్చేరి జట్టు విజయం సాధించింది.
యానాంలో ప్రారంభమైన జాతీయస్థాయి బాస్కెట్బాల్ పోటీలు