పింఛన్ పెంచండి సార్ : వెన్నెముక బాధితులు - వెన్నెముక బాధితులు
వెన్నెముక బాధితులు స్పందన కార్యక్రమానికి తరలివచ్చారు. శాశ్వతంగా మంచం బారినపడిన తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.3వేల పింఛన్ రూ. 10వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ మురళీధర్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు బాధితులు.
pension
ప్రమాదాలకు గురై శాశ్వతంగా మంచం బారిన పడిన తమను ఆదుకోవాలని వెన్నెముక బాధితుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.తూర్పు గోదావరి జిల్లాలోని వెన్నెముక బాధితులు...కాకినాడ కలెక్టరేట్ స్పందన కార్యక్రమానికి తరలివచ్చారు.తమకు ప్రస్తుతం ఇస్తున్న3వేల రూపాయల పింఛన్‌ను10వేల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు.దీనిపై కలెక్టర్ మురళీధర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.