తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం లంకల గన్నవరంలో... ప్లాస్టిక్ నిషేధంపై ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి అధికారులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, పలువురు నిపుణులు హాజరయ్యారు.ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలను విద్యార్థలకు వివరించారు. ప్రస్తుతం విష జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయని విద్యార్థులంతా జాగ్రత్తగా ఉండాలని ఎంపీడీవో చక్రధరరావు కోరారు.
ప్లాస్టిక్ వాడకాన్ని ఆపేద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం
తూర్పు గోదావరి జిల్లా లంకల గన్నవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్లాస్టిక్ నిషేధంపై ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
Awareness Seminar on Plastic usage under the eenadu-etv