ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అక్కడ నొక్కాలి.. ఇక్కడ చూడాలి... గుర్తుమారితే అధికారికి చెప్పాలి' - పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు

పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా యానాంలో నూతన ఓటర్లకు ఈవీఎంలు పనిచేసే విధానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బ్యాలెట్ బాక్సులో వారు ఓటు వేయాలనుకున్న అభ్యర్థి గుర్తు, ప్రక్కనే ఉన్న వీవీ ప్యాడ్ మిషన్​లో కనిపించే చిత్రాన్ని గమనించాలని.. ఏదైనా సమస్య ఉంటే వెంటనే సంబంధిత పోలింగ్ ఆఫీసర్​కు సమాచారం ఇవ్వాలని రిటర్నింగ్ అధికారి అమన్ శర్మ వివరించారు.

awareness on evm to new voters at yanam
యానాంలో ఓటింగ్​పై కొత్త ఓటర్లకు అవగాహన

By

Published : Apr 1, 2021, 3:14 PM IST

కేంద్రపాలిత పుదుచ్చేరి అసెంబ్లీకి ఈనెల 6న ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను రిటర్నింగ్ అధికారులు చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నూరు శాతం ఓటింగ్ జరగాలన్న లక్ష్యంతో ఓటర్లను చైతన్యపరిచేందుకు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా యానాంలో నూతన ఓటర్లకు ఈవీఎంలో ఓటు వేసే విధానాన్ని ఎన్నికల సిబ్బంది వివరిస్తున్నారు.

గుర్తు మారితే..

బ్యాలెట్ బాక్సులో వారు ఓటు వేయాలనుకున్న అభ్యర్థి గుర్తు ప్రక్కనున్న బటన్ నొక్కిన తరువాత కంపార్ట్​మెంట్​లోనే ఉన్న వీవీ ప్యాడ్ మిషన్ స్క్రీన్​లో కనిపించే చిత్రాన్ని చూడాలన్నారు. మీరు నొక్కిన గుర్తు.. కనిపించిని చిత్రం ఒకటై ఉండాలని అధికారులు విద్యార్థులకు వివరించారు. అనంతరం వాళ్లతో ఓట్లు వేయించారు. ఏదైనా సాంకేతిక లోపంతో వేసిన ఓటు వచ్చిన గుర్తు మారినట్లయితే సంబంధిత పోలింగ్ ఆఫీసర్​కు తెలియజేయాలన్నారు.

వారం రోజులపాటు 1500 మంది విద్యార్థినీ విద్యార్థులకు... అలాగే గ్రామీణ ప్రాంతాల్లో నూతనంగా ఓటు హక్కు పొందిన వారందరికీ ఓటింగ్​పై అవగాహన కల్పిస్తున్నామని రిటర్నింగ్ అధికారి అమన్ శర్మ తెలిపారు.

ఇదీ చూడండి:

ఎస్ఈసీతో సీఎస్ భేటీ .. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై చర్చ

ABOUT THE AUTHOR

...view details