ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు భోజన సదుపాయం కల్పించేందుకు.... అవంతి ఫీడ్స్ ప్రైవేటు లిమిటెడ్ ఎండీ అల్లూరి ఇంద్రకుమార్ 1.12 కోట్ల నగదును విరాళం అందించారు. తూర్పుగోదావరిజిల్లా రావులపాలెం మండలం పొడగట్లపల్లి గ్రామంలో హరే కృష్ణ మూవ్‌మెంట్, అక్షయపాత్ర పౌండేషన్ సంయుక్తంగా వంటశాలను ఏర్పాటుచేస్తున్నారు. మంగిపూడి సీతమాంబ మెమోరియల్ ట్రస్టు సభ్యులు పొడగట్టపల్లిలో 1,150 గజాల స్థలాన్ని వంటశాల నిర్మాణానికై అందించారు. భవన శంఖుస్థాపన కార్యక్రమానికి అవంతి ఫీడ్స్ ఎండీ ఇంద్రకుమార్ పాల్గొని భూమి పూజను చేశారు.
'అవంతి ఫీడ్స్ ప్రైవేటు లిమిటెడ్ ఎండీ 1.12 కోట్ల నగదు విరాళం' - mangipudi seethamamba memorial trust
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల కోసం పొడగట్లపల్లి గ్రామంలో హరే కృష్ణ మూవ్‌మెంట్, అక్షయపాత్ర పౌండేషన్ సంయుక్తంగా సామాజిక వంటశాలను ఏర్పాటు చేస్తున్నారు. వంటశాలకు అవంతి ఫీడ్స్ ప్రైవేటు లిమిటెడ్ ఎండీ అల్లూరి ఇంద్రకుమార్ 1.12 కోట్ల నగదును విరాళాన్ని అందించారు.
'అవంతి ఫీడ్స్ ప్రైవేటు లిమిటెడ్ ఎండీ 1.12 కోట్ల నగదు విరాళం'