తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలం రావులపాడుకు చెందిన తెదేపా కార్యకర్త, గర్భిణి కృష్ణకుమారిపై ఈనెల 5న వైకాపా నాయకుల ప్రోద్బలంతో కొందరు మహిళలు దాడి చేశారని, ఫలితంగా ఆమెకు గర్భస్రావమైందని రంపచోడవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి దారుణ ఘటన జరిగినా పోలీసులు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలితో కలిసి సోమవారం రంపచోడవరం ఏఎస్పీ బిందుమాధవ్‌కు ఆమె ఫిర్యాదు చేశారు.
'గర్భిణిపైన వైకాపా నాయకుల ప్రోద్బలంతోనే దాడి' - pregnant woman was also attacked
అడ్డతీగల మండలం రావులపాడుకు చెందిన తెదేపా కార్యకర్త, గర్భిణి కృష్ణకుమారిపై ఈనెల 5న వైకాపా నాయకుల ప్రోద్బలంతో కొందరు మహిళలు దాడి చేశారని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి మండిపడ్డారు. ఇంతటి దారుణ ఘటన జరిగినా పోలీసులు నిందితులపై.. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.
అనంతరం అడ్డతీగలలో మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరి విలేకరులతో మాట్లాడుతూ... ‘ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో దాన్యంపాలెం పంచాయతీ సర్పంచిగా కృష్ణకుమారి మేనకోడలు కెచ్చెల రాజమ్మ తెదేపా మద్దతుతో పోటీ చేశారు. ఆమె తరఫున కృష్ణకుమారి ప్రచారం చేశారు. ఇది సహించలేని వైకాపా నాయకులు ఈనెల 5న కొందరు మహిళలతో ఆమెపై దాడి చేయించారు. దీని కారణంగా ఆమెకు గర్భస్రావమైంది. బాధితురాలికి భర్త చెల్లారెడ్డి దుప్పులపాలెం పీహెచ్‌సీలో వైద్యం చేయించారు. ఆ సమయంలో పోలీసులు వచ్చి కేసు నమోదు చేసినా నిందితులపై చర్యలు తీసుకోలేదు. దాడికి పాల్పడినవారిలో అంగన్‌వాడీ కార్యకర్త సైతం ఉన్నారు’ అని స్పష్టం చేశారు. ఈఘటనపై కేసు నమోదైందని, దర్యాప్తు చేసి బాధితురాలకు న్యాయం చేస్తామంటూ ఏఎస్పీ హామీ ఇచ్చారన్నారు.
ఇదీ చూడండి:'విశాఖ ఉక్కు, అనుబంధ సంస్థల్లో 100 శాతం వాటాలు అమ్మేస్తాం'