''10 నెలలుగా వేతనాలు లేవు.. 10 వేల హామీ అమలు కాలేదు'' - కదం తొక్కిన ఆశాలు
పది నెలలుగా వేతనాలు లేక అవస్థng పడుతున్నామంటూ ఆశా కార్యకర్తల ధర్నా చేపట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల వేతనం ఇప్పటికీ అమలుకాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పది నెలలుగా వేతనాలు లేక అవస్థలు పడుతున్నామంటూ ఆశా కార్యకర్తలు ధర్నాకు దిగారు. తూర్పు గోదావరి జిల్లా ఎటపాక మండల పరిధిలోని నెల్లిపాక జాతీయ రహదారి పక్కన నిరసన చేపట్టారు. జీతాలు రాక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని మూడు పీహెచ్సీల పరిధిలో ఉద్యోగం చేస్తున్న ఆశా కార్యకర్తలు విధులు బహిష్కరించి .... సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 10 వేల రూపాయల వేతనం ఇప్పటికీ అమలు కాలేదని ఆశా కార్యకర్తలు వాపోయారు.