తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని టీవీ వీధిలో జరిగిన రౌడీషీటర్ అద్దేపల్లి సతీష్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు కారణమని మూడో పట్టణ సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు. గతంలో రౌడీషీటర్‌గా ఉన్న శ్రీనివాస్‌నాయుడు, అతని స్నేహితులు కలిసి ఈ ఘాతూకానికి పాల్పడ్డారని చెప్పారు. అయిదుగురు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి రెండు మోటారుసైకిళ్లు, మూడు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.
రౌడీషీటర్ హత్య కేసులో నిందితుల అరెస్టు
రాజమహేంద్రవరంలో జరిగిన రౌడీషీటర్ సతీష్ హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో అయిదుగురు నిందితులను అరెస్టు చేశారు.
హత్య కేసు వివరాలు వెల్లడిస్తున్న రాజమహేంద్రవరం మూడో పట్టణ సీఐ