ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

త్వరలోనే ఆరోగ్యశ్రీ హైల్త్​ కార్డుల పంపిణీ - ఏపీ తాజా వార్తలు

తూర్పుగోదావరి జిల్లాలో అర్హులైన వారికి ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. మొదట దశ కింద 7 లక్షలకుపైగా ఆరోగ్యశ్రీ కార్డులు జిల్లాకు వచ్చాయి. వీటిని త్వరలోనే వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు అందజేయనున్నారు.

arogyasri health cards are ready to  distribute
arogyasri health cards are ready to distribute

By

Published : Apr 8, 2020, 8:34 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో డాక్టర్ వైఎస్​ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి అర్హులైన వారికి హైల్త్​ కార్డులు పంపిణీ చేసేందుకు యంత్రాంగం సిద్ధమైంది. జిల్లాలో ఆరోగ్యశ్రీ కార్డులు పొందేందుకు 16 లక్షల మంది అర్హత కలిగి ఉన్నారని డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ కేర్ ట్రస్ట్ తూర్పుగోదావరి జిల్లా సమన్వయకర్త డాక్టర్ మణిరత్న కిషోర్ తెలిపారు. అయితే ప్రస్తుతం 7 లక్షల 75 వేల ఆరోగ్యశ్రీ కార్డులు జిల్లాకు వచ్చాయని ఆయన వెల్లడించారు. వీటిని జిల్లాలోని మండల పరిషత్ కార్యాలయాలకు పంపారు. త్వరలో గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు అందజేయనున్నారు. త్వరలో రెండో దశ కింద జిల్లాకు మిగిలిన కార్డులు వస్తాయని ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details