తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల్లో నల్లరేగడి, ఎర్ర నేలలు అధికంగా ఉన్నాయి. ఈ భూముల్లో అన్ని పంటలు పండుతాయి. అయితే ఇటీవల ఇక్కడ ఆక్వా రంగం విస్తరించింది. వాస్తవానికి పంటలు పండని నేలల్లో ఆక్వా సాగు చేయాలి. లీజుదారులు.. రైతులకు అధిక కౌలు ఆశచూపి పంటలు పండే వందల ఎకరాలను చేపల చెరువులుగా మారుస్తున్నారు. చేపలకు మేతగా చనిపోయిన కోళ్లను వేస్తున్నారు. దీంతో నీరు, గాలి కాలుష్యమవుతోంది. కరోనా నేపథ్యంలో రేటు లేకపోవడం వల్ల కోళ్ల యజమానులు ఫారాల్లో కోళ్లకు మేత పెట్టడంలేదు. దీంతో వందల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఆ చనిపోయినవాటిని తీసుకొచ్చి, ముక్కలుగా చేసి, చేపలకు ఎరువుగా వేస్తున్నారు. దీంతో ఆ చుట్టుపక్కల దుర్వాసన వస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు.
చేపల చెరువులు.. కాలుష్యానికి ఆవాసాలు - తూర్పుగోదావరి జిల్లాలో ఆక్వా రంగం
సంవత్సరానికి రెండు పంటలకు పైగా పండే పొలాలవి... ఎప్పుడూ పచ్చగా కళకళలాడుతూ.. పరిశుభ్రమైన గాలిని అందించేవి. అయితే ఆ భూముల్లో నేడు చెరువులు దర్శనమిస్తున్నాయి. ఆక్వా చెరువులు విస్తరించాయి. అంతేకాదు.. చనిపోయిన కోళ్ల ఎరువుతో కాలుష్యానికి ఆవాసాలుగా మారాయి తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు, జగ్గంపేట పంట భూములు కాలుష్యం కోరల్లో విలవిలలాడుతున్నాయి.
తూర్పుగోదావరి జిల్లాలో ఆక్వా రంగం