ప్రభుత్వ ఉద్యోగులు కరోనా బారిన పడితే 14 రోజులు వేతనంతో కూడిన సెలవులివ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు అన్నారు. తూర్పుగోదావరి గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడారు.
కొవిడ్ కారణంగా చనిపోతే రూ. 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉద్యోగులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే విధులు నిర్వహించడం కూడా కష్టమేనని చెప్పారు. కొవిడ్ కష్టకాలంలో ప్రభుత్వం.. ఉద్యోగులకు అండగా నిలబడాలన్నారు.