తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణ మహోత్సావాల నిర్వహణలో ఆలయ అర్చకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. స్వామి వారి శ్రీ చక్ర స్నాన మహోత్సవము ఆలస్యంగా నిర్వహించారు. పంపా సరోవరం చెంత ఉదయం 8.30 గా గంటలకు పూజ ప్రారంభం కావాల్సి ఉండగా.. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను 8.51 నిమిషాలకు తీసుకునివచ్చారు. ఆ సమయానికి వర్జ్యం ఉన్న కారణంగా... అప్పుడూ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. 10 గంటల 20 నిముషాలకు చక్ర స్నానం నిర్వహించారు. అర్చకుల తీరుపైభక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుకున్న సమయానికి చక్రస్నానం నిర్వహించకపోవడంపై.. అసంతృప్తి చెందారు. బాధ్యులపై చర్యలకు అధికారులు ఉపక్రమించారు.
అన్నవరంలో 'అపచారం'.. ఆలస్యంగా చక్రస్నానం! - chakra snanam
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యానారయణ స్వామి కల్యాణోత్సవాల్లో అర్చకుల నిర్లక్ష్యం.. భక్తులకు ఆగ్రహాన్ని కలిగిస్తోంది.
అన్నవరం