ఈ నెల 16న చంద్రగ్రహణం సందర్భంగా ఆ రోజు సాయంత్రం 4 గంటల నుంచి తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని ఆలయం మూసివేయనున్నామని ఆలయ అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల వరకే వ్రత టిక్కెట్లు విక్రయిస్తామన్నారు. వ్రతపూజ ముగించి, 4 గంటల నుంచి సర్వ దర్శనాలూ నిలిపివేస్తామని తెలిపారు. మరుసటి రోజున సంప్రోక్షణ అనంతరం... ఉదయం 8 గంటల నుంచి వ్రత టికెట్లను విక్రయించనున్నట్లు తెలిపారు. 9 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని ఆలయ అధికారులు స్పష్టం చేశారు.
16న అన్నవరం సత్యదేవుని ఆలయం మూసివేత - తూర్పుగోదావరి జిల్లా
ఈ నెల 16న చంద్రగ్రహణం సందర్బంగా అన్నవరం సత్యదేవుని ఆలయం మూసివేయనున్నామని, 17నుంచి యథావిధిగా స్వామి వారి కార్యకలాపాలు కొనసాగనున్నాయని ఆలయ అధికారులు తెలిపారు.
16న అన్నవరం సత్యదేవుని ఆలయం మూసివేత
Last Updated : Jul 2, 2019, 10:14 AM IST