కలియుగ వైకుంఠం అన్నవరం శ్రీ సత్యనారాయణస్వామి క్షేత్రం. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో స్వామివారి కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు స్వామి అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెగా ముస్తాబు చేశారు. వివిధ రకాల పుష్పాలతో ఎంతో సుందరంగా అలంకరించారు. అన్వేటి మంటపంలో సీతారాముల చెంతనే ఆసీనులను చేసి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముత్తైదువులు పసుపు కొమ్ములు దంచారు.
సత్యదేవుని కల్యాణ మహోత్సవాలు ప్రారంభం
అన్నవరం శ్రీ సత్యనారాయణస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేడు స్వామి అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెగా ముస్తాబు చేశారు.
అన్నవరం