తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో ప్రధాన అతిథి గృహం పరిస్థితి అధ్వానంగా తయారైంది. భవనం పైకప్పు చిల్లులు పడి వర్షం పడినప్పుడు నీరు కారుతోంది. గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. విద్యుత్ తీగలు వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. ప్రముఖులు, ఉన్నతాధికారులు వచ్చినప్పుడు మాత్రం దీన్ని తాత్కాలికంగా బాగు చేయించి ఆలయ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ప్రమాదం జరగకముందే అధికారులు భవనానికి మరమ్మతులు చేయించాలని భక్తులు కోరుతున్నారు.
అధ్వానంగా అన్నవరం అతిథి గృహం - stage
అన్నవరం దేవస్థానం అతిథి గృహం పరిస్థితి దారుణంగా మారింది. పెచ్చులు ఊడిపోయి, గోడలకు పగుళ్లు ఏర్పడి అధ్వానంగా తయారైంది. అధికారులు స్పందించి బాగు చేయించాలని భక్తులు కోరుతున్నారు.
అధ్వానంగా అన్నవరం అతిథి గృహం