ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముందస్తు చెల్లింపు నగదును ఇప్పించాలంటూ భక్తుల దరఖాస్తులు

అన్నవరం స్వామి సన్నిధిలో వివాహాది శుభకార్యాలు చేసుకోడానికి ముందస్తుగా భక్తులు రిజర్వేషన్లు చేసుకున్నారు. లాక్​డౌన్​ కారణంగా మార్చి 20 నుంచి స్వామి దర్శనానికి అధికారులు అనుమతించలేదు. ఈ సందర్భంగా తాము చెల్లించిన ముందస్తు నగదును ఇప్పించాలంటూ భక్తులు దరఖాస్తులు చేసుకున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్​ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఆలయ ఈవో చెప్పారు.

annavaram devotees asking advance payments returns because of lockdown
తమ చెల్లింపు నగదును ఇవ్వాలంటూ దరఖాస్తు చేసిన భక్తలు

By

Published : Jun 14, 2020, 12:14 AM IST

అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో వివాహాలు, ఉపనయనాలు చేసుకోడానికి చెల్లించిన ముందస్తు రుసుములు తిరిగి ఇవ్వవలసిందిగా భక్తులు దరఖాస్తు చేసుకుంటున్నారు. మార్చి 25 నుంచి ఏప్రిల్​ 12 వరకు సుమారు 219 వివాహాలకు వసతి గదులు, హాల్స్​ను ముందస్తు రిజర్వేషన్​ చేసుకున్నారు. లాక్​డౌన్​ కారణంగా మార్చి 20 నుంచి స్వామి దర్శనానికి భక్తులను అనుమతించలేదు. అనేక మంది ఈ సందర్భంగా వివాహాలను వాయిదా వేసుకోవడం లేదా వారి నివాసాల్లో నిరాడంబరంగా చేసుకున్నారు. దీంతో ముందస్తుగా చెల్లించిన సొమ్మును ఇవ్వవలసిందిగా భక్తులు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ విషయమై దేవాదాయ శాఖ కమిషనర్​కు నివేదిక పంపామని... వారి ఆదేశాను సారం తదుపరి చర్యలు తీసుకుంటామని ఈవో త్రినాథరావు విషయం తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details