గర్భిణీలు, శిశువులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని శిశు, సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. ఇందుకోసం బడ్జెట్లో నిధులను ఎక్కువగా కేటాయించటం జరిగిందని ఆమె తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల ప్రారంభోత్సవంలో మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భారత్ పాల్గొన్నారు. రాజానగరం, దివాన్ చెరువు, వెలుగుబంధ గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. నన్నయ యూనివర్సిటీ లో రాష్ట్ర స్థాయి పౌష్టికాహార మహోత్సవాలు జరగనున్నాయి.
'ఆరోగ్యంగా ఉండాలి..పౌష్టికాహార లేమిని అధిగమించాలి'
తూర్పుగోదావరి జిల్లా రాజాం నియోజకవర్గం పరిధిలో అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తానేటి వనితతో పాటు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎంపీ మార్గాని భరత్ పాల్గొన్నారు.
ఆరోగ్యంగా ఉండాలి..పౌష్టికాహార లేమిని అధిగమించాలి: మంత్రి వనిత