ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోనసీమలో అమ్మవారి జాతర మహోత్సవాలు - అమ్మవారి

ఉగాది పండుగ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సంప్రదాయ నృత్యాలతో కోనసీమ వాసులు సంబరాలు చేసుకున్నారు.

కోనసీమలో అమ్మవారి జాతర మహోత్సవాలు

By

Published : Apr 6, 2019, 2:29 PM IST

కోనసీమలో అమ్మవారి జాతర మహోత్సవాలు

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలంలోని పలుగ్రామాల్లో ఉగాది సందర్భంగా అమ్మవార్ల జాతర ఉత్సవాలు ఆకట్టుకున్నాయి. కోమరాజులంకలోని లంకాలమ్మతల్లి, వెదిరేశ్వరం కాగితాళమ్మ, రావులపాడు ఆదిలక్ష్మి పాటమ్మ జాతర వేడుకలు సంబరంగా జరిగాయి. ఆయా గ్రామాల ప్రజలు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర వేడుకల్లో యువకులు సంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్నారు.

ఆయా గ్రామాల్లోని ప్రజలు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. జాతర మహోత్సవం సందర్భంగా బ్యాండు మేళాలు, కోయ డాన్సు లతోపాటు యువత ఉత్సాహంగా స్టెప్పులు వేశారు. అమ్మవాళ్ల గరగలను డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేసుకుంటూ గ్రామంలో ఊరేగించారు.

ABOUT THE AUTHOR

...view details