ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 4, 2021, 10:28 AM IST

ETV Bharat / state

అమలాపురం పార్లమెంటు తెదేపా యువత అధ్యక్షుడిగా చిలువూరి సతీష్​రాజు

తూర్పు గోదావరి జిల్లా అమలాపురం పార్లమెంటు తెదేపా యువత అధ్యక్షుడిగా చిలువూరి సతీష్​రాజు నియమితులయ్యారు. రాష్ట్ర తెదేపా ఉపాధ్యక్షుడు ఈ మేరకు వివరాలు వెల్లడించారు.

tdp new appointments
అమలాపురం పార్లమెంటు తెదేపా యువత అధ్యక్షుడిగా చిలువూరి సతీష్​రాజు

తూర్పు గోదావరి జిల్లా అమలాపురం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ తెలుగు యువత అధ్యక్షుడిగా రావులపాలెంకుకు చెందిన చిలువూరి సతీష్​రాజును నియమించారు. ఈ సందర్భంగా రాష్ట్ర తెదేపా ఉపాధ్యక్షుడు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మరిన్ని వివరాలు వెల్లడించారు.

కార్యనిర్వాహక కార్యదర్శిగా గనిశెట్టి వీరేష్ (వానపల్లి), కార్యదర్శులుగా డూగపాటి శ్రీనివాస్ (ర్యాలి), అప్పారి గోపి కుమార్ (దేవరపల్లి) నియమితులైనట్లు వివరించారు.

కొత్తపేట నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులుగా మూలస్థానంకు చెందిన బోడపాటి మారుతిని నియమించినట్లు తెలిపారు. అమలాపురం పార్లమెంట్ తెలుగు మహిళ ఉపాధ్యక్షులుగా రావులపాలెంకు చెందిన పోతుమాడి విజయలక్ష్మి, అధికార ప్రతినిధిగా మిద్దే అనురాధ, కార్యదర్శిగా అనసూరి నాగరత్నం నియమితులయ్యారన్నారు. కొత్తపేట నియోజకవర్గం తెలుగు మహిళ అధ్యక్షురాలుగా వెలిచేరుకు చెందిన దుగ్గిరాల సుబ్బలక్ష్మిని నియమించినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:'ఆంబోతుకు అందరూ కలిసి అంత్యక్రియలు నిర్వహించారు'

ABOUT THE AUTHOR

...view details