ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పింఛన్ లబ్ధిదారులందరికీ చంద్రబాబు పెద్ద కొడుకు! - kcr

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో మంత్రి నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం చేశారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామన్నారు. మిగులు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రాలూ 2 వేల రుపాయల పింఛను ఇవ్వడం లేదన్నారు.

అమలపురంలో మంత్రి లోకేశ్ ఎన్నికల ప్రచారం

By

Published : Mar 28, 2019, 10:20 PM IST

అమలపురంలో మంత్రి లోకేశ్ ఎన్నికల ప్రచారం
తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో మంత్రి నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం చేశారు. రైతాంగాన్ని ప్రభుత్వంఅన్ని విధాలుగా ఆదుకుంటున్న విషయాన్ని గుర్తుచేశారు.మిగులు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రాలూ 2 వేల రుపాయల పింఛను ఇవ్వడం లేదని విమర్శించారు. పింఛను తీసుకుంటున్న వాళ్లు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని స్పష్టం చేశారు. లబ్ధిదారులు చంద్రన్నను పెద్దకొడుకుగా భావిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. మాయమాటలు చెప్పేవారికి ఓటేస్తారా.. అండగా ఉండేవారికి ఓటేస్తారా అని ప్రజలను ప్రశ్నించారు. పసుపు - కుంకుమ నగదుతో మహిళలు పట్టుచీరలు కొనుక్కుంటున్నారని చెప్పారు.

ఇవి చదవండి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details