తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డివిజన్లోని కాట్రేనికోన మండలం పల్లంకురు పరిధిలో ఆయిల్ అక్రమ వ్యాపారం చేస్తున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 3వేల లీటర్ల డీజిల్‌ని స్వాధీనం చేసుకున్నారు. అమలాపురం డివిజన్లో ఇసుక అక్రమ రవాణా జరగకుండా నియంత్రించేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని డీఎస్పీ షేక్ మసూమ్ భాషా తెలిపారు. అక్రమ వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేశామన్నారు. అమలాపురం డివిజన్లో లాక్డౌన్ అమలవుతున్న కారణంగా ప్రజలు నియమాలను పూర్తిగా పాటించాలని డీఎస్పీ కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అక్రమంగా ఆయిల్ వ్యాపారం... ఏడుగురి అరెస్ట్
తూర్పుగోదావరి జిల్లాలో అక్రమంగా ఆయిల్ వ్యాపారం చేస్తున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 3వేల లీటర్ల డీజిల్‌ని స్వాధీనం చేసుకున్నారు.
amalapuram dsp