తలుపులమ్మ సన్నిధిలో సాయిరాం కొత్త సినిమా షూటింగ్ - shooting
సినీ నటుడు సాయిరాం నూతన సినిమా షూటింగ్ తూర్పుగోదావరి జిల్లా తుని తలుపులమ్మ దేవస్థానంలో ప్రారంభమైంది. సినిమా షూటింగ్‌ను ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా క్లాఫ్ కొట్టి ప్రారంభించారు.
సాయిరాం
సినీ నటుడు సాయిరాం శంకర్...హీరోగా నటిస్తున్న నూతన చిత్రం షూటింగు తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తలుపులమ్మ ఆలయం ఆవరణలో ప్రారంభమైంది. చిత్ర షూటింగ్‌ను ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా క్లాప్ కొట్టి ప్రారంభించారు. అమృత హర్షిని క్రియేషన్స్, రియల్ రీల్స్, శరణం అయ్యప్ప క్రియేషన్స్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల బృందం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Last Updated : Jun 28, 2019, 1:24 PM IST