తూర్పు గోదావరి జిల్లా తుని మండలం వి.కొత్తూరు వద్ద ఉన్న కస్తూర్బా పాఠశాలలో బుధవారం దారుణం జరిగింది. పాఠశాలలో నాడు- నేడు పనులపై సమావేశం జరుగుతుండగా... పీఈటీ మధురాక్షిపై ఆమె భర్త కత్తితో దాడి చేసి పరారయ్యాడు. అతను పేరెంట్‌గా లోపలికి వచ్చి మధురాక్షిని కత్తితో పొడిచినట్లు చెప్పారు ప్రధానోపాధ్యాయురాలు. తీవ్ర గాయాలపాలైన మధురాక్షిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పాఠశాలలోనే ఉపాధ్యాయురాలిపై భర్త దాడి... - East godavari district crime news
a-teacher-attacked-by-her-husband-with-a-knife-during-review-meeting-on-nadu-nedu-works
Last Updated : Sep 16, 2020, 5:51 PM IST