తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం కొత్త సర్పంచ్ దూదుల రాము.. ఈ నెల 25న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వాహకులు అత్యుత్సాహం ప్రదర్శించి... అమ్మాయిలతో నృత్యాలు చేయించారు.
ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బాధ్యతగా వ్యవహరించాల్సిన వృత్తిని చేపడుతూ ఇలాంటి పాటల నృత్య ప్రదర్శన ఏంటంటూ.. స్థానికులు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు.