ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు - young man died in road accident

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం పెద్ద కందాల పాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో జరిగింది. ఈ ఘటనలో ఓ కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా... నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

A man died in road accident in p.gannavaram
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

By

Published : Jan 16, 2021, 9:58 AM IST

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం పెద్ద కందాల పాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు.. అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిన ఘటనలో.. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. మృతుడిని విజయవాడకు చెందిన చింతా బత్తుల ప్రవీణ్(30) అనే యువకుడిగా గుర్తించారు.

అతని బంధువులు పృథ్వి శరణ్​తోపాటు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మైథిలి, రాజ్ కుమార్ పి.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన గూడూరు అయ్యప్ప తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 అంబులెన్స్​లో అమలాపురం ఆస్పత్రికి తరలించారు. సంక్రాంతి నిమిత్తం మానేపల్లికి చెందిన అయ్యప్ప ఇంటికి మిగిలిన వాళ్లంతా.. నాలుగు రోజుల కిందట వచ్చారు. అల్పాహారం కోసం పి.గన్నవరం వెళ్లి తిరిగి వస్తుండగా పెద్ద కందాల పాలెం వద్ద ఈ ప్రమాదం జరిగింది.

ABOUT THE AUTHOR

...view details