తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం లాకుల వద్ద... ఓ కారు అదుపుతప్పి ప్రధాన పంట కాలువలోకి దూసుకెళ్లింది. రాజమహేంద్రవరం నుంచి అమలాపురం వెళ్తున్న వాహనం అర్ధరాత్రి సమయంలో ప్రమాదానికి గురైంది. కారులో ప్రయాణిస్తున్న అమలాపురానికి చెందిన ముగ్గురు స్థానికుల సాయంతో సురక్షితంగా బయటపడ్డారు. క్రేన్ సహాయంతో... వాహనాన్ని కాలువలో నుంచి బయటకు తీశారు.
వాడపాలెం లాకుల వద్ద కాలువలోకి దూసుకెళ్లిన కారు - తూర్పుగోదావరి జిల్లాలో కారు ప్రమాదం
తూర్పుగోదావరి జిల్లా వాడపాలెం లాకుల వద్ద ఓ కారు అదుపుతప్పి ప్రధాన పంట కాలువలోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిని స్థానికులు కాపాడారు.
వాడపాలెం లాకుల వద్ద కాలువలోకి దూసుకెళ్లిన కారు