ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అర్ధరాత్రి ప్రమాదం.. కారు, చెట్టును ఢీకొని ఇద్దరు మృతి - తాజాగా వేముల వాడ కారు ప్రమాదం

అర్ధరాత్రి కారు.. చెట్టును ఢీకొనటంతో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అదుపుతప్పి వేగంగా కారు చెట్టుని ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు.

car collided with a tree
అర్ధరాత్రి కారు, చెట్టును ఢీకొని ఇద్దరు మృతి

By

Published : Oct 29, 2020, 4:27 PM IST

అర్ధరాత్రి సమయంలో కారు, చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ బాలుడు, యువకుడు దుర్మరణం చెందగా... మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తూర్పు గోదావరి జిల్లా కరప మండలం వేములవాడ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కరప నుంచి వస్తున్న కారు వేములవాడ వద్ద అదుపుతప్పి చెట్టుని ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు.

ఈ ఘటనలో వేములవాడ గ్రామానికి చెందిన 25 ఏళ్ల భగవాన్, 13 ఏళ్ల సాయి అక్కడిక్కడే మృతి చెందగా...సురేష్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో వెంకటసాయిరామ్ అనే యువకుడు సురక్షితంగా బయటపడ్డాడు.

ABOUT THE AUTHOR

...view details