బోటు ప్రమాదానికి సంబంధించి వెలికి తీసిన మరో ఐదు మృతదేహాలను అధికారులు గుర్తించారు.విశాఖలో నివాసముంటున్న కర్నూలు జిల్లా నంద్యాలవాసి మహేశ్వరరెడ్డి,తెలంగాణలోని వరంగల్ అర్బన్‌జిల్లా కొడిపికొండ గ్రామానికి చెందిన బస్కి రాజేంద్రప్రసాద్...పశ్చిమగోదావరి అప్పనవీడు గ్రామానికి చెందిన నడకుదురు శ్రీనివాస్(21)..హైద్రాబాద్ టోలిచౌక్‌కు చెందిన మహమ్మద్ తాలిబ్ పటేల్,విశాఖ జిల్లా అనకాపల్లి గోపాలపురానికి చెందిన పెద్దిరెడ్ల దాలమ్మగా తేల్చారు. మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు.
దేవిపట్నం వద్ద ఐదు మృతదేహాలు లభ్యం - దేవిపట్నం 5మృతదేహాలు
కచ్చులూరు బోటు ప్రమాదంలో ఇవాళ 5 మృతదేహాలను వెలికితీశారు. దేవీపట్నం మండలంలోనే ఈ 5 మృతదేహాలు లభ్యమయ్యాయి. వాటిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, వాటిని కుటుంబ సభ్యులు గుర్తించారు.
దేవిపట్నం వద్ద 5మృతదేహాలు లభ్యం
Last Updated : Sep 18, 2019, 4:19 PM IST