ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దాతల సహకారంతో కొవిడ్ ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు: ఎమ్మెల్యే చిట్టిబాబు - తూర్పుగోదావరి జిల్లా నేటి వార్తలు

తూర్పుగోదావరి జిల్లా ముంగండ గ్రామంలో దాతల సహకారంతో కొవిడ్ ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు వెల్లడించారు.

covid Isolation Center was being set up in Munganda
ముంగండలో కొవిడ్ ఐసోలేషన్ సెంటర్

By

Published : May 19, 2021, 7:43 PM IST

తూర్పుగోదావరి జిల్లా ముంగండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాతల సహకారంతో కొవిడ్ ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తెలిపారు. ఈ మేరకు ముంగండలో పాఠశాల భవనాన్ని ఆయన పరిశీలించారు. దాతలు ఈద శ్రావణ్ కుమార్, సంధ్య, జాషువా, సరోజ.. 30 పడకలతో ఈ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చినట్లు ఎమ్మెల్యే వివరించారు. రెండు రోజుల్లోనే ఇక్కడ ఐసోలేషన్ సెంటర్ ప్రారంభిస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు స్థానిక తహసిల్దార్ బండి మృత్యుంజయరావు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details