నాలుగో దశ పంచాయతీ ఎన్నికలలో ఈరోజుతో నామపత్రాల ఉపసంహరణ గడువు ముగియడంతో..కొన్ని పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డివిజన్లో నాలుగోదశ ఎన్నికలకై ప్రచారాల హోరు మొదలైంది.
అమలాపురం డివిజన్లో 14 పంచాయతీలు ఏకగ్రీవం - అమలాపురం డివిజన్లో పంచాయతీ ఎన్నికలు
నాలుగో దశ పంచాయతీ ఎన్నికలకు గుర్తులు కేటాయించంతో...అభ్యర్థులు ప్రచారాలు మొదలుపెట్టారు. తూర్పుగోదావరి జిల్లాలో నామపత్రాల ఉపసంహరణ అనంతరం అమలాపురం డివిజన్లో 273 గ్రామ పంచాయతీలు, 3142 వార్డులకుగానూ.. 14 గ్రామ పంచాయతీలు, 1077 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన పల్లెల్లో ప్రచారాల జోరు పెంచారు.
అమలాపురం డివిజన్లో 14 పంచాయతీలు ఏకగ్రీవం
డివిజన్ మొత్తం మీద 273 గ్రామ పంచాయతీలలో 3142 వార్డులు ఉన్నాయి. నామపత్రాల ఉపసంహరణ అనంతరం 14 గ్రామ పంచాయతీలు, 1077 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇక మిగిలిన 259 గ్రామపంచాయతీ సర్పంచ్ పదవులు, 2065 వార్డులకు ఎన్నికలు జరపనున్నారు. అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు జరగడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు ఉద్ధృతంగా ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు.
ఇదీ చూడండి.భార్యాభర్తలు.. పల్లె పాలకులు!