తిరుపతిలో పోలీసులకు, స్థానికులకు మధ్య వాగ్వాదం జరిగింది. పట్టణంలోని ఎస్టీవీ నగర్‌కు చెందిన జయచంద్ర అనే యువకుడిని పోలీసులు కొట్టారంటూ అతని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. బైక్ ఆపమంటే ఆపలేదనే కారణంతో యువకుడిని కొట్టారంటూ వారు ఆరోపించారు. దీనిపై తూర్పు పోలీస్ స్టేషన్ సీఐ శివప్రసాద్‌ను వివరణ కోరగా.. రాత్రివేళ కర్ఫ్యూ ఉన్న కారణంగా బైక్‌పై వెళుతున్న జయచంద్రను ఆపే ప్రయత్నంలో కానిస్టేబుల్ లాఠీ తగిలి గాయమైందని వివరించారు.
యువకుడిని కొట్టారని పోలీసులతో కుటుంబసభ్యుల వాగ్వాదం
యువకుడిని కొట్టారంటూ పోలీసులతో అతని కుటుంబసభ్యులు వాగ్వాదం పెట్టుకున్న ఘటన తిరుపతి ఎస్టీవీ నగర్లో జరిగింది. బైక్ ఆపనందుకు పోలీసులు చేయి చేసుకున్నారని వారు ఆరోపించారు.
బాధిత యువకుడు