ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విషాదం: ఏనుగు దాడిలో యువరైతు మృతి - చిత్తూరు జిల్లా కాలవపల్లి గ్రామంలో ఏనుగు దాడి

చిత్తూరు జిల్లా పలమనేరులోని కాలవపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. పొలం పనుల నిమిత్తం ఓ యువరైతు.. అర్థరాత్రి పొలానికి వెళ్లగా అక్కడ సంచరిస్తున్న ఏనుగు అతనిపై దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన రైతు అక్కడికక్కడే మృతిచెందాడు.

farmer died
ఏనుగు దాడిలో యువరైతు మృతి

By

Published : Apr 14, 2021, 10:57 AM IST

ఏనుగు దాడిలో యువరైతు మృతి

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కాలవపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యువరైతు జానికిరామ్(25) పొలానికి నీరు పెట్టేందుకు.. అర్థరాత్రి పొలానికి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ సంచరిస్తున్న ఓ ఏనుగు.. అతనిపై దాడి చేసింది. యువకుడు గట్టిగా కేకలు వేయటంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే తీవ్రంగా గాయపడ్డ జానకిరామ్​.. పొలంలోనే ప్రాణాలు వదిలాడు. జానకిరామ్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చేతికందొచ్చిన కుమారుని మృతితో.. అతని తల్లి రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది.

ABOUT THE AUTHOR

...view details