చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోని బుగ్గకాలువకు చెందిన సహదేవ, వెంకటలక్ష్మిల కుమారుడు విజయనరసింహా ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు . ఆదివారం అతని పుట్టినరోజు సందర్భంగా పది మంది యువకులంతా కలసి మదనపల్లె గ్రామీణ మండలం కొత్తపల్లె పంచాయతీలోని యల్లమ్మకుంట వద్దకు వెళ్లి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కొంతమంది స్నేహితులు ఈత కొట్టేందుకు కుంటలోకి దిగారు. ఇదే సమయంలో విజయనరసింహా ఈత రాకున్నప్పటికి కుంటలోకి దూకాడు . కుంట లోతుగా ఉండటంతో నీటమునిగిపోయి మృతి చెందాడు. మదనపల్లె రూరల్ ఎస్సై దిలీప్ కుమార్, అగ్నిమాపక సిబ్బందితో సంఘటనాస్థలానికి వచ్చి కుంటలో నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సంఘటనాస్థలానికి చేరుకుని రోదించడం అందర్ని కలచివేసింది.
పుట్టిన రోజు వేడుకల్లో విషాదం..నీటికుంటలో పడి యువకుడు మృతి - chittoor latest news
పుట్టినరోజు నాడే ఓ యువకుడు నీటి గుంటలో పడి మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లి మండలంలో జరిగింది. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు
నీటి కుంటలో పడి యువకుడు మృతి