ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Nindra MPP Election:ఎమ్మెల్యే రోజాపై మంత్రి పెద్దిరెడ్డికి ఫిర్యాదు - Nindra MPP Election updates

నిండ్ర ఎంపీపీ ఎన్నిక వ్యవహారంలో ఎమ్మెల్యే రోజా(MLA Roja)పై మంత్రి పెద్దిరెడ్డి(Minister Peddireddy)కి రోజా వ్యతిరేక వర్గం నేతలు ఫిర్యాదు చేశారు. గెలిచిన ఎంపీటీసీ సభ్యులను సస్పెండ్ చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని వాపోయారు. వైకాపా నేతలను ఎమ్మెల్యే రోజా చులకనగా చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ycp leaders
ycp leaders

By

Published : Sep 26, 2021, 10:42 PM IST

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ పరిధిలోని నిండ్ర ఎంపీపీ ఎన్నిక వ్యవహరం మంత్రి పెద్దిరెడ్డి వద్దకు(Minister Peddireddy) చేరింది. ఇవాళ సాయంత్రం రోజా వ్యతిరేక వర్గం, శ్రీశైలం ధర్మకర్తల మండలి ఛైర్మన్ చక్రపాణిరెడ్డి తన అనుచరులతో కలిసి మంత్రిని కలిశారు. ఎమ్మెల్యే రోజా వైకాపా నేతలను చులకనగా చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. భాస్కర్ రెడ్డిని ఎంపీపీగా ఎంపిక చేయాలని మంత్రిని కోరారు. గెలిచిన ఎంపీటీసీ సభ్యులను సస్పెండ్ చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details