ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పలమనేరులో వైకాపా నాయకురాలు ఆత్మహత్యాయత్నం - Palamaneru Latest news

చిత్తూరు జిల్లా పలమనేరులో మాజీ కౌన్సిలర్ షర్మిల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నిద్రమాత్రలు మింగిన షర్మిల... సొంతపార్టీ నాయకుడే రాజకీయంగా వేధిస్తున్నారని ఆరోపించారు. ఆ నాయకుడి నుంచి తన కుటుంబానికి ప్రాణహాని ఉందని భయాందోళన వ్యక్తం చేశారు.

YCP leader commits suicide in Palamaneru
YCP leader commits suicide in Palamaneru

By

Published : Feb 8, 2021, 8:38 PM IST

చిత్తూరు జిల్లా పలమనేరులో మాజీ కౌన్సిలర్, వైకాపా నాయకురాలు షర్మిల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించిన షర్మిలను... పలమనేరు ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు.

సొంత పార్టీలోనే ఓ నాయకుడు రాజకీయ వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఆరోపించిన షర్మిల... అతని నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షర్మిల ఆరోగ్య పరిస్థితి స్థిమితంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details