ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిబంధనలకు విరుద్ధంగా తిరుమలలో వైకాపా ప్రచారం

ఎన్నికల వేళ తిరుమలలో నిబంధనలకు నీళ్లు వదిలారు. పుణ్యక్షేత్రాలలో ప్లకార్డులు, పార్టీ గుర్తులు, పార్టీ కండువాలతో ప్రచారం చేయకూడదనే నిబంధనలు ఉన్నా.. తిరుమల కొండపై వైకాపా ఆ నిబంధనలు అతిక్రమించి ప్రచారం చేసింది.

వైకాపా ఎన్నికల ప్రచారం

By

Published : Mar 21, 2019, 4:06 PM IST

వైకాపా ఎన్నికల ప్రచారం
తిరుమల కొండపై వైకాపా కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొంతమంది వైకాపా కార్యకర్తలు పార్టీ కండువాలు ధరించి బాలాజీనగర్​లో ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. పుణ్యక్షేత్రాలలో ప్లకార్డులు, పార్టీ గుర్తులు, పార్టీ కండువాలతో ప్రచారం నిర్వహించకూడదు. ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండా సాధారణంగా వెళ్లి ఓట్లు అడగొచ్చు. వైకాపా నిబంధనలు పట్టించుకోకుండా ప్రచారం నిర్వహిస్తోంది. అలిపిరి టోల్​గేట్ వద్ద భద్రతా సిబ్బంది అడ్డుకోకపోవడం.. పార్టీ కండువాలతో కొండపై ప్రచారం చేస్తున్నాతితిదే విజిలెన్స్ సిబ్బంది పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

ఇవీ చదవండి.,

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details