ప్రాణం చాలా విలువైందంటారు. కానీ.. డబ్బు ముందు పేదవాడి ప్రాణం విలువ చాలా తక్కువ అని చెప్పే సంఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగింది. కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్చించే స్తోమత లేక.. కట్టుకున్న భార్య.. తన కళ్లముందే కనుమూస్తున్నా ఏమీ చేయలేక.. నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు అమరేశ. కర్ణాటకలోని ముల్బాగళ్ ప్రాంతంలోని బేరకూరుకు చెందిన అమరేశ, శోభ.. కుప్పంలోని ఓ కోళ్ల ఫారంలో కూలీలుగా పనిచేస్తున్నారు. వారి పిల్లలు ఊరిలోని నాయనమ్మ వద్ద ఉంటున్నారు.
కట్టుకున్న భార్య.. కళ్ల ముందే లోకాన్ని వీడిన వేళ...! - వైద్యానికి డబ్బులు లేక మహిళ ఆత్మహత్య
కట్టుకున్న భార్య.. తన కళ్ల ముందే.. తన ఒడిలోనే కాలం చేస్తుంటే.. చూస్తూ ఉండిపోయిన ఓ భర్త నిస్సహాయత ఇది..! ఆయువు పోసేదీ.. ప్రాణం తీసేదీ.. పైసలేనన్న చేదు నిజాన్ని చాటి చెప్పిన సంఘటన ఇది..! విధి చేతిలో ఓడిన అభాగ్యుడు అమరేశ కథ ఇది..!
ఏం జరిగిందో ఏమో!
భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ జరిగిందో... లేక మరేదైనా కారణమో కానీ శోభ కోళ్లఫారంలోని ఈగల మందు తాగింది. భర్త అమరేశ హుటాహుటిన ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి చేయిదాటింది.. పెద్దాసుపత్రికి తీసుకెళ్తే తప్ప బతకదని తేల్చారు. చేతిలో పైసా లేని అమరప్ప.. భార్యను తీసుకుని సొంతూరుకు బయలుదేరారు. కుప్పం బస్టాండులో ఉండగానే శోభ.. కన్నుమూసింది. భార్య తన ఒడిలో కన్నుమూస్తుండగానే.. అమరేశ అసహాయంగా చూస్తూ ఉండిపోయాడు. ఆ హృదయ విదారక ఘటనను చూసి అందరి కళ్లూ చెమ్మగిల్లాయి.
TAGGED:
women suicide